⇒ ఎస్ఆర్ యూనివర్సిటీకి NIRF ఇంజనీరింగ్ కేటగిరీలో ఆలిండియా 91వ ర్యాంక్…
⇒ NIRF ఇంజనీరింగ్ కేటగిరీలో వరుసగా నాలుగో ఏడాది కూడా 100 లోపు స్థానం…
SR University : ఎస్ఆర్ యూనివర్సిటీ మరోసారి తన ప్రతిభను చాటుకొని, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF)–2025లో ఇంజనీరింగ్ కేటగిరీలో 91వ ర్యాంక్‌ను సాధించింది. వరుసగా నాలుగో ఏడాది టాప్ 100లో చోటు దక్కించుకోవడం ద్వారా విద్యా నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలపై SR విశ్వవిద్యాలయం పట్టును మరోసారి రుజువు చేసుకుంది.
ఎస్ఆర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ఎనగందుల వరద రెడ్డి మాట్లాడుతూ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (NIRF) ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేటగిరీలో 91వ ర్యాంక్, యూనివర్సిటీ కేటగిరీలో 101–150 బ్యాండ్లో స్థానం సంపాదించడం గర్వకారణమని. తెలంగాణలోని ప్రైవేట్ సంస్థలలో ఇంజనీరింగ్ కేటగిరీలో టాప్ 100లో స్థానం పొందిన ఏకైక సంస్థ ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మాత్రమేనని తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ దక్కించుకోవడంలో విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం విద్యార్థుల కృషి ఉందని పేర్కొన్నారు.
అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల మధ్య ఎస్ఆర్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచిందని. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఆంత్రప్రెన్యూర్షిప్ విలువలను పాఠ్యాంశంలో భాగంగా చేసుకోవడంతో పాటు, బలమైన అధ్యాపక బృందం, సమర్థవంతమైన పరిశోధన ఫలితంగా 5000+ పరిశోధన పత్రాలు, 1000+ పేటెంట్లు, 50+ పేటెంట్లు పొందినట్లు, 50+ పరిశోధన ప్రాజెక్టుల ద్వారా 15 కోట్ల నిధులు, అలాగే మైక్రోసాఫ్ట్ నుండి 51 LPA వంటి అత్యుత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు సాధ్యమయ్యాయి అని తెలిపారు.
ఈ కార్యాక్రమంలో ప్రో వైస్ ఛాన్సలర్ Dr వి. మహేష్, రిజిస్ట్రార్ Dr. ఆర్. ఆర్చన రెడ్డి, వివిధ స్కూల్స్ డీయాన్స్, వివిధ విభాగాల హెడ్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
