February 26, 2026

Kaloji Narayana Rao : కాళోజీ పోరాటం… మన యాస ,భాష, సంస్కృతి కోసమే

Kaloji Narayana Rao : కాళోజీ నారాయణరావు  111వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ మాండవిక భాషా దినోత్సవం” గా ప్రకటించడం జరిగినది దీన్ని అన్ని వర్గాల ప్రజలు జయంతి వేడుకలను జరుపుకోవాలని ప్రకటించారు దానిలో భాగంగానే ఏవీవి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ బుజేందర్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కాళోజి నారాయణరావు  జీవిత మొత్తం తెలంగాణ యాస, భాష మరియు సాంస్కృతిక కోసమే తను ఎప్పుడు ఆలోచించేవాడని ముఖ్యంగా తెలంగాణ కోసం తొలి ఉద్యమంలో మరియు మలి ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు తన రచనలు “నా గొడవ” ద్వారా మన యాస, భాష కోసం నిజాం ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి మన యాస భాష పట్ల ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు ఎన్నో చేశారని అన్నారు. అలాగే కోడి మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కాకున్నా కూడా తెలంగాణ కోసం తెలంగాణ యాస, భాష కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని తను ఎప్పుడు అంటుండేవాడని :చావు నీది, పుట్టుక నీది ,బ్రతుకంతా సమాజానిది” మన భాష, యాస, సంస్కృతిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దని తను చనిపోయిన తన పార్టీవదేవాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్ కి అందించి పరిశోధనలకు ఉపయోగపడుతున్నాడని మీరు ఎప్పుడూ తెలంగాణ ప్రజల్లో తీరస్తాయిగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు డాక్టర్ ఎస్ అనిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సాయి హర్షిత్ ,దేవిశ్రీప్రసాద్ ,సాకేత్, క్రాంతి ,రాజ్ కుమార్ ,చందన ,సాత్విక, నవ్య, సుహానా, సల్మా, మిన్ను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *