August 23, 2026

Plastic manufacturing : హైటెక్స్ లో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ప్రారంభం

Plastic manufacturing : తెలంగాణా ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానీఫ్యాక్టరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. తెలంగాణ & ఆంధ్ర ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, 50 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా నిర్వహిస్తున్న HIPLEX ’26 ప్రదర్శన ప్లాస్టిక్ పరిశ్రమలో సరికొత్త సాంకేతికత, ఆటోమేషన్ మరియు తయారీ రంగ అభివృద్ధిని ఆవిష్కరించనుంది అని ఎక్స్ పో నిర్వాహకులు *నరేంద్ర బాలద్వా, మీలా జయదేవ్, బి ఎల్ బంధాని, అనిల్ రెడ్డి* పేర్కొన్నారు.
🏆 HIPLEX ’26 ప్రత్యేకతలు
🔹 దక్షిణ మరియు మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ప్రదర్శన
🔹 భారతదేశంలో 3వ అతిపెద్ద ప్లాస్టిక్ ప్రదర్శన
🔹 100కు పైగా లైవ్ మెషీన్లు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఆధునిక సాంకేతికత, ఆటోమేషన్‌ను ప్రదర్శించనున్నాయి
🔹 500కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఇందులో అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయి
🔹 HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లోని 7 హాళ్లలో ప్రదర్శన నిర్వహించబడుతుంది
🔹 దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి 50,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉంది
ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన ప్రముఖ తయారీదారులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారులు మరియు పరిశ్రమ ప్రతినిధులు ఒకే వేదికపై కలుసుకునే ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనకు మీ విలువైన సమక్షం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *