August 5, 2026

Clothing exhibition : భద్రాచలం లో కాసం ఫ్యాషన్స్ ఎగ్జిబిషన్ ఘన ప్రారంభం

Clothing exhibition : తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన కాసం ఫ్యాషన్స్ మాల్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశాలలో 29 శాఖలతో విస్తరించిందన్నారు. ఈ క్రమంలో భద్రాచలం లో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి యాంకర్ రష్మీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.

రిబ్బన్ కటింగ్ అనంతరం రష్మీ మాట్లాడుతూ,
భద్రాచలం ప్రజలు కాసం ఫ్యాషన్స్ ఎగ్జిబిషన్ మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది. కాసం ఫ్యాషన్స్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ:
• “ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం” అని తెలిపారు.

కాసం ఫ్యాషన్స్ షాపింగ్ మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ తో ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి కాసం ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్స్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *