Road Show : వరంగల్ జిల్లా అనంతసాగర్లోని సుమతి రెడ్డి కళాశాల విద్యార్థినిలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా భారీ రోడ్డు షో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో “మాదక ద్రవ్యాలు వినాశనం చేస్తాయి- సంస్కృతి చైతన్యాన్ని కలిగిస్తుంది” అనే నినాదంతో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, సుబేదారి సిఐ రంజిత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీసీపీ కవిత మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తిగత సమస్య కాకుండా సమాజాన్ని కుంగదీసే తీవ్రమైన సామిజిక సమస్య అన్నారు. ముత్తు పదార్థాలు యువత భవిషతును, ఆరోగ్యాన్నీ, కుటుంబ జీవనాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలు విద్యా బోధనకే పరిమితం కాకుండా విద్యార్థులలో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత భావాన్ని పెంపొందించాలిసిన అవసరం ఉందన్నారు. సి ఐ రంజిత్ మాట్లాడుతూ రోడ్ షో లో అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. యువత మత్తు పదార్థాలను వ్యతిరేకంగా ఏకతాటిపై నిలిచిందని, ఈ కార్యక్రమం సమాజానికి బలమైన సందేశాన్ని అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యాథిపతులు ఏవో వేణుగోపాలస్వామి, అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

