Opening : గజ్వేల్ లో కాసం ఫ్యాషన్స్ ఏకైక మొట్ట మొదటి అతి పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభం చేసారు. ఆట పాటలతో సందడి చేసి అభిమానులను అలరించిన అందాల సినీ తార ప్రముఖ యాంకర్ అనసూర్య భరద్వాజ్ గజ్వేల్ పట్టణంలోకాసంఫ్యాషన్స్ 28వ స్టోర్ లో జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా అనసూర్య మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో కాసంఫ్యాషన్స్ పేరు గాంచిందని అన్నారు. ఈ స్టోర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్బంగా అనసూర్యభరద్వాజ్ కాసం ఫ్యాషన్స్ లోని లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేసారు. గజ్వేల్ చుట్టు పక్కల ప్రాంత వాసులు షాపింగ్ కాసం ఫ్యాషన్స్ లో చేయాలని అన్నారు. కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 28 స్టోర్స్ ప్రారంభించాం అని అన్నారు. మా వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అధునాతన ఫ్యాషన్ డిజైన్లను వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు*. తమ సంస్థ ద్వారా గజ్వేల్ లో స్థానికులకు నిరక్ష్యారాసులవారికి ప్రభుత్వ జాబ్ అవకాశం లేని వారికి 150 మందికి ఉపాధి కల్పిస్తున్నమన్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా నమ్మకం లేదని తమ వద్ద సామాన్య వ్యక్తులకు కూడా ఉపాధి గ్యారంటీ అన్నారు. తొలుత సినీనటి అనసూర్య భరద్వాజ్ను చూడడానికి ఉదయం నుండి అభిమానులు, పరిసర ప్రాంత యువతి, యువకులు బారులు తీరారు. యువతి యువకుల కేరింతలతో కాసం షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమం లో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్ తో పాటు పట్టణం లోని ప్రముఖులు పాల్గొన్నారు.

