February 26, 2026

Swami Vivekananda Birthday : వివేకానందుని బోధనలే నేటి యువతకు ఆదర్శం

Swami Vivekananda Birthday : స్వామి వివేకానంద 164వ జన్మదిన వేడుకలను మరియు జాతీయ యువజన దినోత్సవo సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కళాశాల నుండి పాపాయిపేట్ చమన్ లోని వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాలంటీలను నిర్దేశించి కొడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 1893 సెప్టెంబర్ 11న జరిగిన “ప్రపంచ మత సదస్సులో” స్వామి వివేకానంద గారు వివిధ దేశాల మత ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ నా ప్రియమైన అన్నలారా, అక్కల్లారా అని సంబోధిస్తూ చేసిన ప్రసంగం సభికులను ఎంతో ఉత్సాహం మరియు ఆనందపరిచిందని హిందూమత గొప్పతనాన్ని విశ్వ మానవులంతా ఓకే కుటుంబమని అదే వసుదైక కుటుంబమని, యువకుల కోసం తన ప్రసంగాల ద్వారా యువతను ఉత్తేజపరిచి ఆదర్శప్రాయుడిగా నిలిచాడనీ వారి ప్రసంగాలు బోధనల ద్వారా యువతలో ఆత్మస్థైర్యం పెంపొంది వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి దృఢ సంకల్పంతో లక్ష్యం వైపు దూసుకు వెళ్లి లక్ష్యాన్ని,విజయం సాధించాలని తద్వారా మన దేశానికి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ అధ్యాపకుడు నాగ శ్రీనివాస్, భాస్కర్ ,పరేష్ కుమార్, సీనియర్ వాలంటీర్ సాకేత్, పూర్ణ చారి, సాయి ,హర్షిత్, రోహిత్, శ్రీధర్, దుర్గ, నీరజ్,రుత్విక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *