February 26, 2026

Birth Day Celebrations: ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

Birth Day Celebrations: ఏ వి వి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి 95వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భూజేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజికవేత్త సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా మహిళల సాధికారికత మరియు విద్య కోసం ఎంతో పాటు పడ్డారని వారు విద్యలో ఉన్నత స్థానంలో వచ్చినప్పుడే వారి అభివృద్ధిభి, కుటుంబ అభివృద్ధి, సమాజ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో తను చాలా ఎన్నో ఒక ఉద్యమంలో మహిళా విద్య కోసం ఎంతో శ్రమ చేశారని అన్నారు అలాగే శ్రీనివాసరావు మాట్లాడుతూ తను మొదటి మహిళా భారతదేశ టీచరుగాను ,సామాజిక కార్యకర్తగాను రచయితగా ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ఎంతో శ్రమించారని 19వ శతాబ్దంలోని వారు అనగారిన వర్గాల మహిళల కోసం ఒక ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లి మహిళల అభివృద్ధి కోసం తోడ్పడ్డారని అన్నారు, వీరు సేవలను గుర్తించి ప్రభుత్వము ఈ రోజును “జాతీయ మహిళా దినోత్సవం” గా ప్రకటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు స్వప్న , సీనియర్ వాలంటీర్లు దేవిశ్రీప్రసాద్, ఓం ప్రకాష్, అభిలాష్, నవ్య శ్రీ, మన్విత, హర్షప్రియ, శ్రీజ ,మిన్ను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *