Prevention of suicides : ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సైకాలజిస్ట్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ భుజేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత లక్ష్యం వైపు పయనిస్తూ కొన్ని అనివార్య కారణాలవల్ల లక్ష్యాన్ని సాధించలేకనప్పుడు ఆత్మహత్యలే శరణ్యమని అనుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది చాలా దారుణం ఆత్మహత్యలు సమస్యకు ఎప్పుడు పరిష్కారం కాదని ఇంకా తనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు, ఇతరులకు హాని కలుగుతుందని దయచేసి ఎవ్వరు ఆత్మహత్య చేసుకోవద్దని లక్ష్యం నెరవేరు నప్పుడు ఎప్పుడూ ప్లాన్ “బి “సిద్ధంగా ఉండాలని ఇంకా ఎన్నో ప్రత్నామ్యాయ అవకాశాలు మనకు ఈ సమాజం అందిస్తుందని దీని గ్రయించి జీవితంపై ఆశావాదం దృక్పథంతో ముందుకు సాగాలని దీనికి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్,ఆత్మీయుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువత చాలా సున్నిత మనస్కులు ఉంటున్నారని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు పాడుతున్నారని ప్రతి సంవత్సరము ఇండియాలో లక్షకు పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇందులో అధిక భాగం యువతే ఉన్నారని ఇది చాలా ఆందోళనకరమైన విషమని తెలియజేస్తూ విద్యార్థులను సంఘటితపరిచి ఆశావాద దృక్పథం పై అవగాహన కార్యక్రమాలు, జీవితం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రముఖ మానసికవేత్తలతోని శిక్షణ ఇప్పించి తద్వారా వాలంటీర్లు తమ యొక్క మిత్రులకు, పెద్దలకు అందరికీ అవగాహన కలిగించాలని వాలంటీలను కోరారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ డాక్టర్ అనిత ,అధ్యాపకురాలు దేశ బోయిన స్వప్న , డాక్టర్ శ్రీధర్, జి శ్రీనివాస్ వాలంటీర్లు చెయాంక్ ,సిద్దు, చిరంజీవి, రాజ్ కుమార్, సాత్విక్, నీరజ్, దేవి శ్రీ ప్రసాద్ ,సాయి హర్షిత్, గణేష్, మన్విత, నవ్య, హర్ష ,ప్రవళిక, స్రవంతి, సాత్విక తదితరులు పాల్గొన్నారు.
