June 5, 2026

JEE Advance Results : జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఎస్ఆర్ విజయభేరి

JEE Advance Results : జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయస్థాయిలో విజయభేరిని మ్రోగించారు. సోమవారం వెలుబడిన ఫలితాల్లో మరో మారు ఆధిపత్యాన్ని కొనసాగించారు. జెఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో పి.శ్రీచరణ్ (రూ.నెం. 266189046) 2వ ర్యాంకు, ఎన్.మైత్రేయి (రూ.నెం. 266189038) 23వ ర్యాంకు, డి. ఇస్సాక్ (రూ.నెం. 266184003) 27వ ర్యాంకు, పి. గౌరీ సత్య సాయి స్వరూప్ (రూ.నెం. 266134043) 88వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఓపెన్ కేటగిరీలో జాతీయస్థాయిలో వరుసగా 134, 152, 158, 182, 203, 209, 281, 311 మరెన్నో ర్యాంకులను సాధించారు. విద్యార్థులు సాదించిన విజయాలకు ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి భవిషత్తులో మరింత విజయాలను సాదించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలలో పటిష్టమైన ప్రణాళికతో హై స్కూల్ , జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఐపిఈ, జేఈఈ మెయిన్, టిజి-ఈఏపి సెట్ లో కూడా విశిష్టమైన మార్కులు, ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఎస్ఆర్ విద్యా సంస్థలో విద్యనభ్యసించిన వారు దేశ, విదేశాలలో వేలమంది ఉన్నతమైన పదవులలో ఉన్నారని తెలుపుటకు ఎంతో ఆనందంగా ఉందని వరదా రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *