Telangana Farmers : ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం 1,551.89 కోట్లు విడుదల చేశామన్నారు. దీని ద్వారా 10.45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్