Govindadri Goshala : వరంగల్ గోవిందరాజుల గుట్ట సమీపంలో ఉన్న గోవిందాద్రి గోశాలలో ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం లోక కల్యాణార్థం కోసం శ్రీ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్య వచ్చిన భక్తులచే గోపూజ, అర్చనలు చేశారు. భక్తులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధరణి సాయి సేవా సంఘం సభ్యులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.