Agriculture program : వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీకి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి( ఐసిఏఆర్ ) నుంచి స్కూల్ అఫ్ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ(Hons) అగ్రికల్చర్ ప్రొగ్రాము రెండింటికి గుర్తింపు పొందింది. ఈ గుర్తింపుతో రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూల్ / కాలేజీ ప్రొగ్రాము స్థాయిలో ఐసిఏఆర్ గుర్తింపు పొందిన తొలి యూనివర్సిటీగా ఎస్ఆర్ యూనివర్సిటీ నిలిచింది. అయిదేళ్లపాటు ఈ గుర్తింపు ఉంటుందని అగ్రికల్చర్ నేషనల్ ఆక్రెడిటేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ సందర్బంగా ఎస్ఆర్ యూనివర్సిటీ ఛాన్సులర్ వరదారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై యూనివర్సిటీ చేస్తున్న కృషికీ ఈ గుర్తింపు నిదర్శనమని తెలిపారు. దీని ద్వారా స్కూల్ అఫ్ అగ్రికల్చర్ అండ్ సంభందిత కోర్స్ ల ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు ఐసిఏఆర్ స్కాలర్షిప్స్, ఫెల్లో షిప్స్ కు అర్హత పొందుతారు. అదేవిధంగా యూనివర్సిటీ కి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయి. వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ ఈ గుర్తింపునకు యూనివర్సిటీ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. స్కూల్ అఫ్ అగ్రికల్చర్ డీన్ ప్రొఫెసర్ భూపాల్ రాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీలో 13 ఆధునిక ప్రయోగశాలలు, వ్యవసాయ భూములు, పోలిహౌస్ , షెడ్ సెట్, వాతావరణ పరిశోధన కేంద్రం వంటి సదుపాయాలున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ కార్యక్రమం, 10కి పైగా అనుభవాదారిత అభ్యస కార్యక్రమ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రముఖ వ్యవసాయ సంస్థలు మరియు అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలతో 25కు పైగా ఒప్పందాలు కుదుర్చుకుంది. స్కూల్ అఫ్ అగ్రికల్చర్ లో 90% అధ్యాపకులు డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ అర్హతలు కలిగి ఉన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తూ వ్యవసాయరంగ అభివృద్ధికి ఎస్ ఆర్ యూనివర్సిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమణారావు, డీన్ ఆపరేషన్ ప్రొఫెసర్ అర్చనా రెడ్డి, ప్రొఫెసర్ రాజశేఖర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
