CBSE exam results : బుధవారం సీబీఎస్ఈ బోర్డ్ వారు ప్రకటించిన సీబీఎస్ఈ టెన్త్ పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన బొక్క హర్షవర్ధన్ (నెం.28145278) జాతీయ స్థాయిలో 491/500 మార్కులు సాధించారు. వంగపెల్లి సంహిత (నెం. 28145399) జాతీయ స్థాయిలో 485/500 మార్కులు, పెంచల క్షేత్రిక (నెం. 28145396) జాతీయ స్థాయిలో 482/500 మార్కులు, భానోతు వర్షిత్ (నెం. 28145277) జాతీయ స్థాయిలో 482/500 మార్కులు, భానోతు సుధేష్ణ 480/500 మార్కులు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టినారు. ఇంతటి విజయానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్య, పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం అని, ప్రస్తుత పరిస్థితులలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో, క్రమశిక్షణ సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదా రెడ్డి తెలిపారు. తమ విద్యా సంస్థలలో పోటీ పరీక్షలను ఎదుర్కొనేవిధంగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ లలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి గాను ఒక బృహత్తరమైన పద్దతిలో ప్రైమ్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు.
ఈ అఖండ విజయాన్ని సాధించి విద్యార్ధులను, ప్రోత్సహించిన వారి తల్లితండ్రులను, ఆధ్యాపక బృందానికి ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా జేఈఈ (మెయిన్స్)-2026 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.




