మడిపల్లి గ్రామ 15సం. చిరకాల వాంఛ రోడ్డు సాకారం చేసిన… ఎమ్మెల్యే నాగరాజు
నోరు అదుపులో పెట్టుకో.. లిక్కర్ రాణి కవిత.. మా సీఎం ను విమర్శించే స్థాయి నీకు లేదు..
KR nagaraju : కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వమని నిరూపిస్తూ వర్ధన్నపేట నియోజక వర్గం అభివృద్ధి లక్ష్యంగా చేస్తూ హసన్పర్తి మండల పరిధిలోని మడిపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా చిరకాల కల రోడ్డు సహకారం చేస్తూ సి ఆర్ ఆర్ నిధుల సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న రోడ్డు పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. తోలుత ఎమ్మెల్యే నాగరాజు ని గ్రామస్తులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే మా ప్రభుత్వలక్ష్యం. నాణ్యతతో పనులు ఈ పనులు పారదర్శకంగా, నాణ్యతతో చేయాలన్నదేనా స్పష్టమైన ఆదేశం. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ఈ సీసీ రోడ్లు మరియు డ్రైన్లు పూర్తయిన తర్వాత ప్రజలకు మంచి వాతావరణం, రవాణా సౌలభ్యం, శుభ్రత అందుతుంది. ప్రతి పథకం ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లే బాధ్యతను నేను గౌరవంగా తీసుకుంటున్నాను.
ప్రజల సహకారం కీలకం అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. మీ ఆశీర్వాదం,మీ సహకారం నాకు బలంగా నిలుస్తుంది అన్నారు. గత 10 బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న సొమ్ము అంతా సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ నాటకాలు ఆడుతూ ఇప్పుడు కొత్తగా లిక్కర్ రాని అలియాస్ కవిత మళ్లీ తెలంగాణలో దోచుకునేందుకు జాగృతి అని మళ్ళీ తెర మీదికి వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు మీ మాటలు విని మోసపోవడానికి ఎవరు లేరు మా నాయకుడు రేవంత్ రెడ్డిని విమర్శించే మీ పార్టీకి పుట్టగతులు లేకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా మీకు సిగ్గు రావడంలేదన్నారు. మడిపల్లి గ్రామంలోని అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తానన్నారు. గ్రామానికి తర్వలోనే మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేందుకు కృషి చేస్తాన న్నారు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు మాచర్ల మహేందర్, మాజీ సర్పంచ్ చిర్ర సుమలత విజయ్, నాయకులు సుధాకర్ రెడ్డి, రాజు, శ్రీరామ్, తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.