kazipet Railway Division: కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైల్వే శాఖ రూల్స్ కు మించి ట్రాక్ కిలోమీటర్ల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 2700 కిలోమీటర్ల ట్రాక్ పరిమితిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే సుమారు 3200 కిలోమీటర్ల ట్రాక్ పర్యవేక్షణ పెరగనుంది. ఇది రైల్వే నిబంధనల కంటే ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవకు లేఖ రాశారు. సికింద్రాబాద్ పరిధిలో నుంచి కాజీపేట నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలను లేఖలో వివరించారు. సంబంధిత వినతి పత్రాన్ని బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రికి అందజేశారు. సెంట్రల్ రైల్వే మినిస్టర్ సానుకూల నిర్ణయం తీసుకుంటే కాజీపేట రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
