October 7, 2025

Temple : శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా దుర్గా సప్తశతి పారాయణం

Temple : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దుర్గా సప్తశతి పారాయణం చండీ హోమం, సామూహిక లలితా సహస్ర నామ పారాయణం, కుంకుమార్చన మహామంగళ హారతులు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాపాక గోపికిషన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి దశ విధ హారతులు ఇచ్చారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాతృమండలి సభ్యులు, దేవాలయ ట్రస్ట్ సభ్యులు వామనరావు, డాక్టర్ లక్ష్మినారాయణ, కృష్ణప్రసాద్, బెండల అర్జునరావు, చకిలం ఏకాంబరం, డాక్టర్ శార్వాని, తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *