February 26, 2026

Medaram : సమ్మక్క-సారలమ్మను దర్శించిన ఎమ్మెల్యే నాయిని…

Medaram : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఈ రోజు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవార్లను ప్రార్థించారు. అనంతరం జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *