Grand Opening : తెలంగాణ రాష్ట్రం 2012 వరంగల్‌లో ఆరంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోనూ అడుగుపెట్టింది. రాయచూర్, గుల్బర్గా, బీజపూర్, హుబ్లీ ఇపుడు బెల్గంలో 27వ స్టోర్ ప్రారంభించారు. ప్రఖ్యాత కన్నడ హీరోయిన్ శ్రీలీల దీపప్రజ్వలన చేసి మాల్‌ను ఆరంభించగా అనంతరం మాల్‌లోని విభాగాలను సందర్శించి అభిమానులతో కలసి సందడి చేశారు. హీరోయిన్‌ను చూడటానికి ఉదయం నుండే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీలీల రిబ్బన్ కట్ చేసి మాట్లాడుతూ బెల్గం ప్రజలు ఈ మాంగళ్య షాపింగ్ మాల్ ను ఆదరించాలని దాంతో విజయవంతంగా నడుస్తుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.
బెల్గం సౌత్ శాసన సభ్యులు అభయ్ పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ బెల్గంలో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించడం వల్ల స్థానికులకు ఉపాధి పెరగడమే కాక వ్యాపారం స్థానికంగా జరుగుతుంది అని ఆనందం వ్యక్తం చేసారు మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నర్సింహా మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివ ప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల వేడుకలకు అనువైన నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందించడం మా విజయ రహస్యం అన్నారు.
• “మా స్వంత మగ్గలపై చేయించిన వస్త్రాలను, మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా రూపొందించడం వల్ల పోటీ వస్త్రదారులకన్నా ముందుంటున్నాం.”
మాంగళ్య షాపింగ్ మాల్‌లో స్త్రీ, పురుషులు, యువతీ యువకులు, పిల్లలకు సరిపోయే అత్యాధునిక ఫ్యాషన్ కలెక్షన్లు, వివాహ & శుభకార్యాల ప్రత్యేక వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై బెల్గం ప్రజలు వివాహాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే సరసమైన ధరలకు కావలసిన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం కలిగింది.
