February 26, 2026

Warangal Bus Stand : మేడారానికి భక్తుల క్యూ.. కిక్కిరిసిన బస్టాండ్!

Warangal Bus Stand : సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో వరంగల్ బస్టాండ్ భక్తులతో పోటెత్తింది. ఇప్పటి వరకు 55 వేల మంది ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో మేడారానికి చేరవేసినట్లు డీఎం ధరంసింగ్ తెలిపారు. గురువారం ఒక్కరోజే ఉదయం 11 గంటల వరకు 107 ట్రిప్పుల ద్వారా 4,611 మందిని గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *