February 26, 2026

Bhadrakali Temple : దేవస్థానాన్ని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి

Bhadrakali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి *శ్రీమతి అన్నా లెజ్నెవా* సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణికి ఆలయ ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు శ్రీ చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్కుమార్ శర్మలు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *