December 16, 2025

Vande Maataram Song : 150 సంవత్సరాల సందర్భంగా ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

Vande Maataram Song : వందేమాతర గీతం ఆవిష్కరించి 150 సంవత్సరాల సందర్భంగా ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామూహిక వందేమాతర గీతాలపన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ గారి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో వందేమాతర గీతం స్ఫూర్తి మంత్రంగా పని చేసిందని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ అన్నారు. వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న నవంబర్ 7 వ తేదీన పూర్తి గీతాలాపన చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఏవీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు వందేమాతర గీతం పూర్తి గీతం యొక్క భావాన్ని తెలియజేసారు. భారతీయుల్లో దేశభక్తిని, స్ఫూర్తి ప్రదాయకమైన భావాలతో కూడిన వందేమాతర గీతం ప్రజలందరిలో ఐకమత్యానికి దోహద పడిందని అన్నారు. గీతాలాపన అనంతరం వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. వందేమాతర గీత విశిష్టతను విద్యార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏవీవీ కళాశాలల ప్రిన్సిపాల్ భుజేందర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, హై స్కూల్ ఇన్చార్జి వాసుదేవులు అధ్యాపకులు వీరేశలింగం, చండీశ్వర్ ,రాజశేఖర్, భాస్కర్, డాక్టర్ విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి అధ్యాపకులు ప్రోగ్రాం అధికారి శ్రీనివాస రావు, అర్చన, సరోజ,జి శ్రీనివాస్, పీడీ గోపి నాన్-టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *