Special Commissioner of Information Department : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ గా సిహెచ్ ప్రియాంక ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖ స్పెషల్ కమిషనర్ గా ఉన్న హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీ గా బదిలీ చేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ గా ఉన్న సిహెచ్ ప్రియాంక ను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ ఉదయం సచివాలయంలో హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గా భాద్యతలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు.