February 26, 2026

Balanagara Venkateswara Temple : స్వామివారికి 108 కిలోల పులిహోరతో “తిరుప్పవాడ “ సేవ.

Balanagara Venkateswara Temple : శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామివారి దేవాలయం లో కార్తీక మాసం మూడవ శనివారం ఉదయం 6-00 గంటలకు సుప్రభాతం 9-00 గంటలకు స్వామివారికి 108 కిలోల పులిహోరతో “తిరుప్పవాడ “ సేవ శ్రీ శ్రీనివాస పద్మావతి సేవా ట్రస్ట్ వారిచే అశేష భక్తజన సందోహంతో కన్నుల పండువగా జరిగింది. శనివారం సందర్భముగా వేలాదిగా స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం 6-00 గంటల నుండి గార్నేపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో గోవిందాద్రి గో సేవ వారిచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరిగిందని ఆలయ ఈఓ కిషన్ రావు ఆలయ చైర్మన్ పరాశరం శ్రీనివాసా చారి గారు తెలిపారు ఈరోజు ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయంలోని సేవా సమితి సభ్యులు సేవలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *