November 14, 2025

Warangal East : వరద ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యవసర సరుకులు

Warangal East : ఈరోజు వరంగల్ తూర్పు 28వ డివిజన్ లోని వరద ముంపు ప్రాంతాల్లోని సంతోష్ మాత కాలనీ సంతోష్ మాత కాలనీ 2 లో సుమారుగా 450 కుటుంబాలకు నిత్యవసర సరుకులు 16 రకాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ కమిషనర్ చేతుల మీదిగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి సందర్భంగా గందే కల్పన నవీన్  కమిషనర్ గారితో డివిజన్లోని ఉన్నటువంటి ప్రధాన సమస్యల గురించి చర్చించగా కమిషనర్ సానుకూలంగా స్పందించడం జరిగినది. వారికి డివిజన్ కార్పొరేటర్ గారు ధన్యవాదాలు తెలుపడం జరిగినది. అలాగే మార్వాడి సమాజ్ వారు వరదలు వచ్చినప్పుడు కాలనీ వాసులందరిని ఆశ్రమం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత డివిజన్లోని సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రాజేష్ శంకర్ సింగ్ చకిలం సతీష్ బగల్ కళ్యాణ్ నరసింహారెడ్డి కనకాచారి బోయిని రవి పొకల రాము పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *