Greater Vysya Business Leaders [GVBL] : వరంగల్ పట్టణం లో గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రమాణ స్వీకారం పట్టణంలోని ఆర్యవైశ్య కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఈఓ మంచి రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు వ్యాపార రంగంలో నూతన పోకడలతో కొత్త పుంతలు తొక్కించాలని, కొత్త తరాన్ని ప్రోత్సహించి యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలని అన్నారు. కాకతీయ చాప్టర్ చైర్మన్ గా ఓలం ప్రభుకిరణ్, వైస్ చైర్మన్ ఆపరేషన్ గా బొడ్ల రవీంద్రనాథ్, వైస్ చైర్మన్ ఫైనాన్స్ గా గౌరీశెట్టి ప్రభాకర్ లతో పాటు 14 మంది డైరక్టర్లు, 65 మంది సభ్యుల తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టైటాన్ కౌన్సిల్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్, కార్యదర్శి రవీందర్, మెంబెర్స్ శ్రీనివాస్, రవి, వేణు రామిని లావణ్య, ఆనంతుల వీణ, పల్లెర్ల చైతన్య, గార్లపాటి ప్రసన్న రోజా ,తోట కళ్యాణి లు పాల్గొన్నారు, అనంతరం మహిళలు, చిన్నారులు ఆట పాటలతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.



