Warangal Temples : వరంగల్ బట్టల బజార్‌లోని శ్రీబాలనగర వెంకటేశ్వర స్వామికి శనివారం ఉదయం తిరుప్పావడ సేవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రత్నాకర్ రెడ్డి, అర్చకులు, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.