February 26, 2026

Bhadrakali Temple : భద్రకాళీ దేవస్థానం హుండీలు లెక్కింపు

Bhadrakali Temple :  వరంగల్ మహానగరంలో  శ్రీ భద్రకాళీ దేవస్థానం హుండీలు విప్పి లెక్కింపు జరుపగా 61,58,999 ఆదాయం సమకూరినది. అట్టి ఆదాయము యూనియన్ బ్యాంక్, కె.ఎం.సి బ్రాంచినందు జమచేయనైనది. విదేశీ కరెన్సీ 316 యూ.ఎస్.ఏ డాలర్లు, 15 యు.ఏ. ఈ దిరమ్స్, 70 కెనడా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 10 ఇంగ్లండ్ పౌండ్స్, 100 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ లభించారు. హుండీలో వెళ్ళినటువంటి మిశ్రమ బంగారం మరియు వెండి తిరిగి హుండీలో వేయనైనది. ఈ హుండీ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కురవి కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యనారాయణ, దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు వీరన్న, రాములు,  గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి ఎం.మయూరి, శ్రీమతి జి. స్రవంతి, పూర్ణచందర్, బి. సతీష్,  జె. వెంకటేశ్వర్లు, పాలడుగుల ఆంజనేయులు, అనంతుల శ్రీనివాస్, రామల సునీత మరియు ప్రధానార్చకులు భద్రకాళి శేషు, లక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షులు జి. కృష్ణారెడ్డి, లక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి అధ్యక్షులు  జి. నవీన్ ఆధ్వర్యంలో సభ్యులు 160 మంది మరియు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *