Open Gym : ఈరోజు చందాకాంతయ్య స్మారక మైదాన ప్రాంగణంలో మహిళలకు సౌకర్యవంతంగా ఉండి వారి రోజువారి వ్యాయామానికి అనుకూలంగా ఉంటుందని ఇట్టి విషయాన్ని మన వాకర్స్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ చింతం సారంగపాణి కోరిక మేరకు స్థానిక కార్పొరేటర్ శ్రీ సురేష్ జోషి ప్రోద్బలంతో మహిళల ప్రత్యేక జిమ్ ఏర్పాటు చేయడమైనది ఇట్టి కార్యక్రమాన్ని… కార్పొరేటర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడమైనది ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలు వారి యొక్క నిత్యజీవితంలో వ్యాయామం తప్పకుండా అవసరమైనటువంటి సందర్భంలో వారికి ప్రత్యేక వ్యాయామం చేయడం కోసం సుమారు 6 లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడమైనది అని చెప్పినారు దీనికి మట్టి లెవెలింగ్ కోసం సహకరించినటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చింతం సారంగా పని మాట్లాడుతూ మనం అడిగిన వెంటనే మనకు జిమ్ ఏర్పాటు చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీ సురేష్ జోషి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే మన మైదానంలో సాయంత్రం వేళలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో స్థానిక కార్పొరేటర్ చర్య తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తగు చర్యలు గైకొనుటకు చర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ చీర్ల మల్లారెడ్డి , సుదర్శన్ రెడ్డి , చింతం సంతోష్ , కానుగంటి అశోక్ , కొత్త నగేష్ , చింతం మధుసూదన్ , తౌటం ధనంజయ , శెట్టి కిషన్ రావు కొంగ శ్రీధర్ , కోశాధికారి భద్రయ్య గారు తదితర వాకర్స్ మిత్రులు పాల్గొన్నారు..

