Warangal Temple : వరంగల్ జిల్లాలో ఉన్న శంకర మఠంలో శంకర జయంతి సందర్బంగా నేడు శుక్రవారం శ్రీ శృంగేరి శంకర మఠములో ఉదయం శ్రీ శంకరాచార్యులకు విశేషమైన పంచామృతాలతో, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులచే సౌందర్యలహరి, శ్రీ లలిత పంచ స్తోత్రం, తోటకాష్టకం పారాయణం చేయించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్థం, ప్రసాదము అందజేశారు. ట్రస్ట్ సభ్యులు పాల్గొని అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.