August 27, 2025

Anganwadi Centers : ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి

Anganwadi Centers : హనుమకొండ: 3 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ హనంకొండ జిల్లా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి గారి అధ్యక్షతన 49వ డివిజన్ జులైవాడ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట -అంగన్వాడి బాట ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో అంగన్వాడి సెంటర్ కి పిల్లల్ని పంపించినట్లయితే వారిలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సామాజిక, మేధో అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. అంగన్వాడి టీచర్స్ అందరూ చిత్తశుద్ధితో న్యూ కరికులమ్ ప్రకారం ఫాలో అవుతూ పిల్లలని అంగన్వాడీ కేంద్రం పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకే అన్ని అంగన్వాడీ కేంద్రాలలో బెల్ మోగించి ప్రీస్కూల్ కార్యక్రమాలని న్యూ టైం టేబుల్, సిలబస్ ద్వారా నిర్వహిస్తూ ప్రీస్కూల్ నమోదు, హాజరు ను పెంచి, పిల్లలని సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ సెంటర్లోనే ఉంచవలసిందిగా కోరారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా అందించే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలలోనే తినేలాగా సూచించారు. స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని, ఒక గర్భిణీ గా ఉన్నప్పటి నుంచి అంగన్వాడి సెంటర్స్ లో నమోదు చేసుకొని, అంగన్వాడి సర్వీసెస్ అన్ని అందుకుంటూ పుట్టిన బిడ్డకి ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు కూడా అంగన్వాడి సెంటర్ లో అంగన్వాడీ టీచర్ల చే సంరక్షించబడుతుందని తెలియజేశారు. అదేవిధంగా వారి కూతురైన ఆధ్యా పటేల్ మూడు సంవత్సరాలు పాపని కూడా అంగన్వాడి కేంద్రంలో జాయిన్ చేయడం జరిగింది. 30 మంది మూడు సంవత్సరాల నిండిన పిల్లలకి జిల్లా కలెక్టర్, 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హనుమకొండ సిడిపిఓ ఎం విశ్వజ, సూపర్వైజర్స్ వి రాజలక్ష్మి , ఎం జ్యోతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ డి. ప్రీతి, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ డి కళ్యాణి అండ్ స్టాప్, సఖి అడ్మిన్ హైమావతి అండ్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు ఎం ప్రసన్న, రమాతార , అంగన్వాడి హెల్పర్లు, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు, అంగన్వాడి లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *