Dattatreya Jayanti Celebrations : వరంగల్ ములుగు రోడ్ లోని శ్రీ వరద దత్త క్షేత్రంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం దత్తాత్రేయ స్వామికి పంచామృతాలతో విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తుల తో ఉత్సవ మూర్తికి తైలాభిషేకాలు చేయించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా దత్త హోమం, సుగంధ తైలాభిషేకం, మహా మంగళ హారతి, విశేషమైన అలంకరణ చేశారు. సూదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాపాక గోపికృష్ణశర్మ , దేవాలయం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
