April 21, 2026

Traffic Constable : సేవా స్పూర్తిని చాటుకున్నా కానిస్టేబుల్ గంగాధరి రమేష్

Traffic Constable : వేసవికాలం తీవ్రత దృష్ట్యా హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధరి రమేష్ సేవా స్పూర్తిని చాటుకున్నారు. నగరంలోని సిపిఓ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, వాహన ప్రయాణికులు మరియు బస్సు డ్రైవర్లకు తన సొంత ఖర్చులతో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచిస్తూ, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపిన కానిస్టేబుల్ చర్యలను ప్రయాణికులు, డ్రైవర్లు అభినందించారు. తన సొంత ఖర్చులతో సేవ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత ప్రేరణ కలిగిస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *