February 26, 2026

Bhadrakali Temple : తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీ ఏ. సుదర్శన్ రెడ్డి దంపతులు సందర్శించారు

Bhadrakali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీ ఏ. సుదర్శన్ రెడ్డి దంపతులు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన అడ్వకేట్ జనరల్ గారికి దేవాలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన్ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో మటవాడ సి.ఐ శ్రీ కరుణాకర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు అమ్మవారికి దర్శించుకున్న ప్రముఖులలో సౌత్ సెంట్రల్ రైల్వే సిసి.సి.ఎం. శ్రీమతి ఇతి పాండే తదితరులన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మంచినీటి సౌకర్యం ప్రసాదలు తదితర ఏర్పాట్లు దేవాలయ ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీ గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీ ఓరుగంటి పూర్ణచందర్, శ్రీ బింగి సతీష్, శ్రీ అనంతుల శ్రీనివాస్ లు పర్యవేక్షించారు. ఈ రోజు శుక్రవారం మరియు వరుసగా సెలవులు రావడంతో భక్తులు దేవాలయమునకు పోటెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *