January 22, 2026

Mukkolati Ekadashi : ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు

Mukkolati Ekadashi : వరంగల్ రామన్నపేటలో ఉన్న శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్దయెత్తున భక్తులు తరలి వచ్చారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్వామి వారిని దర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందచేశారు. భక్తులు భారీ యెత్తున తరలివచ్చారు. భక్తులచే సాయంత్రం సంపూర్ణ భగవద్గీత పారాయణం 700 శ్లోకాలు పఠనం చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు వేదాశీర్వచనం చేసి అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *