Neet Exam : ఈ నెల 4వ తేదీన జరిగే నీట్ పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతి ఇస్తారని కలెక్టర్ తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పేన్నులు, పెన్సిల్లు తీసుకు రావద్దు. పరీక్ష కేంద్రాల వద్దే అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు హన్మకొండ పరిధిలో 10 పరీక్ష కేంద్రాలను, వరంగల్ పరిధిలో 1 పరీక్ష కేంద్రమును కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ అటెండెన్స్, రిజిస్ట్రేషన్, తనిఖీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 1:30 లోపు గానే రావాలని కోరారు. పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డ్ లో ఒక పాస్ పోర్టు సైజ్ ఫోటో, మరొక పోస్టు కార్డ్ సైజ్ ఫోటో అడ్మిట్ కార్డ్ కు అతికించాలన్నారు. అదనంగా మరో పాస్ పోర్టు సైజ్ ఫోటో తెచ్చుకోవాలని అన్నారు. అప్డేట్ ఆధార్ కార్డు తప్పనిసరి తెచ్చుకోవాలని కోరారు. లేటెస్ట్ ఫోటోతో ఐడి ప్రూఫ్ తీసుకురావాలని సూచించారు. దివ్యాంగులు ధ్రువికరించిన సర్టిఫికేట్లను తీసుకురావాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు, డిజిటల్ గడియారాలు, బ్లూ టూత్ వంటివి అనుమతి లేవని అన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నీట్ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సంబంధించిన శాఖాధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
exams / జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్