Cricket : రెండు నెలలుగా జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు మంగళవారం ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. వీరిలో విజేత ఎవరు అనే ఉత్కంఠ ఇప్పటినుంచే నెలకొంది. కప్పు పంజాబ్ కింగ్స్ గా లేదా కింగ్ విరాట్ కోహ్లీ టీం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దా రేపటి లోగా తేలనుంది. ఐపీఎల్ లో మొదటి నుంచి నిలకడగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. రేపు జరగనున్న ఫైనల్ లో ఈ రెండు జట్లు అమీతుని తేల్చుకోనున్నాయి. అయితే బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చూస్తే రెండు జట్లు సమఉజ్జీవులుగా ఇప్పటివరకు ఆడుతూ వచ్చాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు ప్రధాన బ్యాటింగ్ బలంగా ఉన్నాడు. బెంగళూరు టీంకు కింగ్ కోహ్లీ బలం ఉంది. బౌలింగ్ విభాగంలోనూ రెండు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఓవైపు హర్షదీప్ సింగ్, స్తాయినిస్, మరోవైపు భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ బౌలింగ్ విభాగంలో రెండు వైపులా బలం కనిపిస్తోంది. ఏదేమైనా రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 18 జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు బెంగళూరు పంజాబ్ జట్లకు ట్రోఫీ దక్కిన పరిస్థితి లేదు. ఫైనల్లో ఎవరు విజేతలైన మొదటిసారి కప్పు కొట్టిన రికార్డు నమోదు కానుంది. కప్పు ఎవరిది అనేది శ్రేయస్ అయ్యర్. విరాట్ కోహ్లీ ఆటపైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కప్పు పంజాబ్ కింగ్స్ గా లేదా కింగ్ కోహ్లీ టీమ్ దా తేలాలంటే రేపు రాత్రి వరకు వేచి చూడాల్సిందే.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ