February 26, 2026

Balanagara Swamy : బాలనగర వెంకటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు

Balanagara Swamy : వరంగల్ బట్టల బజార్‌లోని శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామికి నేడు శనివారం ప్రత్యేక పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రతి గురువారం తిరుమలలో తిరుప్పావడ సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే విధంగా నేడు అత్యంత వైభవంగా తిరుప్పావడసేవ నిర్వహించారు. అనంతరం మహా మంగళ హారతి ఇచ్చారు. అర్చకులు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, ట్రస్ట్ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *