SR Educational Institutions : ఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు పొందడమే లక్ష్యంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యానని, తనకు కార్డియాక్ సర్జన్ కావాలని లక్ష్యంగా ఉందని నీట్ యూజి – 2026లో జాతీయ స్థాయిలో 9వ ర్యాంకర్ వీరయ్యగారి సహ్యూ అన్నారు. నీట్ లో జాతీయ స్థాయిలో మెరిసిన వరంగల్ నగరానికి చెందిన వీరయ్యగారి సహ్యూ మాట్లాడుతూ మొదటిసారి నిర్వహించిన నీట్ పేపర్ లీక్ వల్ల రద్దయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా మరింత పట్టుదలతో చదివానని కష్టానికి తగిన ఫలితం లభిం చిందని అన్నారు. రోజూ పది గంటల పాటు కష్టపడి చదవడం ద్వారానే జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించినట్లు నీట్-యూజీ 2026 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 9వ ర్యాంక్ సాధించిడం గర్వంగా ఉందని వీరయ్యగారి సహ్యూ తెలిపారు. వరంగల్ కు చెందిన డాక్టర్ వీరయ్యగారి రమా కాంత్, డాక్టర్ శ్రీదేవి దంపతుల కుమారుడైన సహ్యూ తన నీట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ ‘మొదటిసారి నీట్ పరీక్ష సులువుగా ఉంది. రెండోసారి మాత్రం కఠినం గా ఉందని, అయినా సబ్జెక్ట్ పై ఉన్న పట్టుతో సునాయాసంగా పరీక్ష రాసినట్లు తెలిపారు. నీట్ పరీక్షకు ముందు 108 సార్లు గ్రాండ్ టెస్ట్ లు రాశానని, దీంతోపాటు వీక్లీ పరీక్షలు 500కుపైగా రాశానని, ఈ పరీక్షల ద్వారా తన ప్రతిభకు పదును పెట్టడంతోపాటు సమయపాలన అలవర్చుకున్నానని తెలిపారు.తన తండ్రి రమాకాంత్ తన గురువైన ప్రముఖ సర్జన్ వేదుల సత్యనారాయణ మూర్తి సేవలను పదేపదే గుర్తుచేసేవారని, ఆయన గురిం చి గొప్పగా చెప్పేవారని, అది విన్నప్పుడల్లా తాను డాక్టర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నానని తెలిపారు. దీంతోపాటు వైద్యులైన తన తల్లిదండ్రుల స్ఫూర్తితో తాను కూడా డాక్టర్ కావాలను కున్నానని, తాను ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ చదువుతూనే నీట్ పరీక్షకు సిద్ధమయ్యానని,కాలేజీలో అధ్యాపకుల నుంచి మంచి సహకారం లభించిందన్నారు. ఈ ర్యాంకు సాధించడంలో తల్లిదండ్రులు, ఎస్ఆర్ కాలేజ్ అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉందని సహ్యూ తెలిపారు.’వైద్య రంగంలో రాణిస్తున్న తమ అమ్మానాన్నలే తనకు స్ఫూర్తి’ అని తెలిపారు. రోజుకు 10 గంటలు చదవడంతో పాటు, అధ్యాపకుల ప్రోత్సాహంతో తనకు ఈ ర్యాంకు వచ్చిందన్నారు.


