February 26, 2026

Hyderabad : ఖర్మాన్‌ఘాట్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 28వ శాఖ ఘన ప్రారంభం

Hyderabad : 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఖర్మాన్‌ఘాట్ ప్రాంతంలో మాంగళ్య షాపింగ్ మాల్ 28వ శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై, దీప ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అక్కడి కలెక్షన్లను పరిశీలించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

రిబ్బన్ కటింగ్ అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ,
“ఖర్మాన్‌ఘాట్ ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది. వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతమవుతుంది” అని తెలిపారు.
ఎల్ బి నగర్ శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గం లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించినందుకు అభినందించింది ఇక్కడ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుందన్నారు

ఈ సందర్భంగా మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ,
“ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం” అని తెలిపారు.
అలాగే, “మా స్వంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేస్తూ, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నాం” అని పేర్కొన్నారు.

మాంగళ్య షాపింగ్ మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్లతో పాటు, వివాహాలు మరియు శుభకార్యాలకు ప్రత్యేకంగా రూపొందించిన భారీ వెడ్డింగ్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మాల్ ప్రారంభంతో ఖర్మాన్‌ఘాట్ పరిసర ప్రాంతాల ప్రజలు పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.1 లక్ష వరకు విస్తరించిన ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో, మాంగళ్య ఒక సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మరో 9–10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనుందని, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య షాపింగ్ మాల్, పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ షాపింగ్ మాల్‌గా ఎదుగుతోందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *