V.B. nirmala geethamba : వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మల గీతాంబా “ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం” సందర్భంగా వరంగల్ మరియు హనుమ కొండ జిల్లాల న్యాయ సేవాధి కార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహిం చడం జరిగింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయ మూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమ కొండ జిల్లాల న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూ ర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస శ్రీధర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనా లజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరు లు పాల్గొన్నారు.ఈ అవగా హన సదస్సులో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగదారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయ డానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాల న్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకుని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయా మంఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు. హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండె పోటులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచిం చారు. ముఖ్యంగా యువత పొగాకునకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞను చేపించడం జరిగింది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ