February 26, 2026

BhadraKali Temple : భద్రకాళీ దేవస్థానాన్ని దర్శించుకున్న న్యాయమూర్తులు

BhadraKali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు ఉదయం మనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ మరియు భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం దేవాలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ ఉపకమీషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించి శ్రీమతి రామల సునీత గారిని దేవాలయ చైర్మన్ డా॥ బి.శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు శ్రీయుతులు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీ గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీ ఓరుగంటి పూర్ణచందర్, శ్రీమతి మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, శ్రీమతి నార్ల సుగుణ, శ్రీ అనంతుల శ్రీనివాస్, శ్రీ బింగి సతీష్, శ్రీ అనంతుల శ్రీనివాస్, అర్చకులు శ్రీ భద్రకాళి శేషులు పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలువలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు శ్రీ జారతి వెంకటేశ్వర్లు శ్రీ పాలడుగుల ఆంజనేయులు కూడా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *