South railway : వరంగల్ రైల్వేస్టేషన్ ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. ఈనెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా రైల్వేస్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో నేడు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. వరంగల్ రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దిన విషయం ప్రయాణికులకు తెలిసిందే. ఏర్పోర్ట్ స్థాయిలో రైల్వేస్టేషన్ తీర్చి దిద్దినట్లు ప్రయాణికులు అనుకుంటున్నారు. కొత్త లిఫ్ట్ లు, రాంపులు, ఎస్కాలేటర్లు, సువిశాల ప్లాట్ఫారం, రైల్వేస్టేషన్ ముందు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
వరంగల్ ప్రతినిధి.