⇒ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం.
⇒ పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుంది.
⇒ గ్రేటర్ వరంగల్ 15వ పరిధిలోని మొగిలిచర్ల రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేసిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు.
Greater warangal : శుక్రవారం గ్రేటర్ వరంగల్ 15వ పరిధిలోని మొగిలిచర్ల రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలను అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనాల మేరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని, పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ది, విద్యా, వైద్యం,సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ లక్ష్యం అన్నారు.
గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో దోచుకుందని, మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, బిఆర్ఎస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసారో చెప్పాలన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిగులు బడ్జెట్ తో ఉన్న ధనిక రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు 40 డైట్ చార్జెస్, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ,2 లక్షల లోపు రైతు రుణమాఫీ, తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.