February 26, 2026

77th Republic Day : బైకులపై జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహణ

77th Republic Day : జాతీయ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి కొడిమాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ప్రజల్లో జాతీయ భావం ,దేశభక్తి పెంపొందించేలా బైకులపై జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించడం జరిగినది, ఈ ర్యాలీని ప్రారంభిస్తూ కళాశాల కార్యదర్శి డాక్టర్ డాక్టర్ చందా విజయ్ కుమార్ గారి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు సరదాలు, ఆనందం కోసం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారాన్ని వీరిని జాతీయతపై మరియు దేశభక్తి పెంపొందించడం చాలా ముఖ్యమని వారిని సన్మార్గంలో తీసుకురావాలంటే జాతీయభావం ఎంతో ముఖ్యమని దీనివల్ల విద్యార్థులలో మార్పు వచ్చి దేశా అభివృద్ధికి పాటుపడతారాని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ భూజేందర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, శాశ్వత సభ్యులు చందా శ్రీకాంత్,అధ్యాపకులు బి గోపి, సంజీవ ,డాక్టర్ శ్రీధర్ , సీనియర్ వాలంటీర్లు దేవిశ్రీప్రసాద్, సాయి, ధీరజ్ ,పూర్ణ చారి ,దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *