Ayyappa Sumangali : అయ్యప్ప సుమాంజలి వారు అయ్యప్ప స్వామి దీక్ష నియమావళి పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది నియమావళి ఆరవ ప్రచురణ పుస్తకం స్వాములు గురుస్వాములు అందరి చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క బుక్ రిలీజ్ చేస్తూ అయ్యప్ప సుమాంజలి అధ్యక్షుడు గందె నవీన్ మాట్లాడుతూ స్వాములకు అయ్యప్ప దీక్ష గురించి మరియు నియమావళి గురించి ఎలా పాటించాలి ఎలా ఉండాలని ప్రతి ఒక్క భక్తులకు అయ్యప్పలకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ పుస్తకాన్ని ప్రచురణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు ఆవురుపెల్లి శ్రీకాంత్ గురు స్వామి శబరిమల అయ్యప్ప సేవా సమాజం గౌరవ అధ్యక్షులు అక్కినపల్లి అంజయ్య గారు శబరిమల అయ్యప్ప సేవా సమాజం పరపతి సంఘం అధ్యక్షులు గందె నవీన్ కుమార్ గురు స్వామి,పెండ్లి రాజు గోపిశెట్టి కరుణాకర్, కోకా చలపతిరావు గురుస్వామి, మురికి కరుణాకర్, శ్రీరాముల సురేష్, యాద మురళి గురుస్వామి, తదితరుల పాల్గొన్నారు.
