Shopping Mall : పలమనేరు లో కాసం ఫ్యాషన్స్ ఏకైక మొట్ట మొదటి అతి పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభం పలమనేరు పట్టణంలోకాసంఫ్యాషన్స్ 24వ స్టోర్ ను అనసూర్య భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో కాసంఫ్యాషన్స్ పేరు గాంచిందని అన్నారు. ఈ స్టోర్ ను పలమనేరు లో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్బంగా అనసూర్యభరద్వాజ్ కాసం ఫ్యాషన్స్ లోని లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేసారు. పలమనేరు చుట్టు పక్కల ప్రాంత వాసులు షాపింగ్ కాసం ఫ్యాషన్స్ లో చేయాలని అన్నారు. ముందుగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి గారు రిబ్బన్ కట్ షోరూం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పలమనేరు లో మాల్ ప్రారంభం చేయడం ఆనందంగా ఉందని ప్రజలకు కొత్త షాపింగ్ అనుభూతి కలుగ చేస్తుందని స్థానికులకు ఉపాధి అవకాశం కలుగుతుంది అన్నారు. కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 24 స్టోర్స్ ప్రారంభించాం అని అన్నారు. తమ సంస్థ ద్వారా పలమనేరు లో స్థానికులకు నిరక్ష్యారాసులవారికి ప్రభుత్వ జాబ్ అవకాశం లేని వారికి 150 మందికి ఉపాధి కల్పిస్తున్నమన్నారు. కార్యక్రమం లో పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్ తో పాటు పట్టణం లోని ప్రముఖులు పాల్గొన్నారు.


