Cleanliness Festival : స్వచ్ఛ మహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చారిత్రాత్మ కిలా వరంగల్ లో ఆర్కేలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఏవివి ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ మహోత్సవంలో భాగంగా “ఏక్ దిన్ ,ఏ గంట, ఏక్ సాత్ “అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ప్రముఖ కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గడ్డం సమ్మయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశంలో పాల్గొనడం మనందరి అదృష్టమని పరిశుభ్రతతోనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటామని ఇంటిని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా మనకు ఈ సీజన్లో వచ్చే రోగాలు ముఖ్యంగా దోమల నుండి వచ్చే రోగాలు ఆ పరిశుభ్రతతోనే వస్తాయని కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ ప్రోగ్రాం లో పాల్గొని తమ ఇంట్లో, వాడలో చుట్టుపక్క ప్రాంతాల్లోనీ ప్రజలను చైతన్య పరచవలసినదిగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డివిజన్ ముఖ్య ఆఫీసర్ హెచ్ ఆర్హె ఆరు దేశాయి, అసిస్టెంట్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఇంజనీరు కృష్ణ చైతన్య, కన్జర్వేషన్ అసిస్టెంట్ గోల్కొండ ఎం మల్లేశం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు, గైడ్ రాజు సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేవిశ్రీప్రసాద్, సాకేత్ ,సాత్విక్, చిరంజీవి, శివ, ఫయాజ్, సాయి హర్షిత్, క్రాంతి, మన్మిత ,నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్