Temples : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సామూహిక అనఘా వ్రతాలు వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం శుక్రవారం బహుళ అష్టమి సంవత్సరములో ఒకసారి వచ్చే ఈ వ్రతంలో సుమారు వెయ్యి జంటల భక్తులు పాల్గొని స్వామి- అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ కార్యక్రమంలో కొక్కుల రాజేంద్రప్రసాద్, ఆలయ అర్చకులు గోపికృష్ణ, నిర్వాహకులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
