Bhadrakali Temple : కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుచూ తన కరుణారస వీక్షణంతో ఓరుగల్లు ప్రజల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి శ్రీ లక్ష్మీశ్రీనివాస సేవా ట్రస్ట్ మహబూబాబాద్ అధ్యక్షులు శ్రీ బి. కృష్ణా రెడ్డి అధ్వర్యంలో పోచమ్మమైదాన్ రత్నా హోటల్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు మేళతాళాలతో సుమారు 300 మంది భక్తులు ర్యాలీగా విచ్చేసి శ్రీ భద్రకాళి అమ్మవారికి చీర, సారె తో పాటు 51 రకాల స్వీట్లు వివిధ రకాల పండ్లు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తాగరు క్రాంతి, బింగి సతీష్, శ్రీమతి మోతుకూరి మయూరిరాము, శ్రీమతి గాండ్ల స్రవంతి, శ్రీమతి నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, ఈఓ శ్రీమతి శేషుభారతి ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషులు తదితరులు ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి శ్రీ భట్టి శ్రీనివాస్ భార్గవి దంపతులు, కార్పోరేటర్లు శ్రీమతి చాడ స్వాతిరెడ్డి, శ్రీమతి దేవరకొండ విజయలక్ష్మీసురేందర్, శ్రీ లక్ష్మిశ్రీనివాస సేవాసమితి కార్యదర్శి శ్రీమతి ప్రేమలత, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి నాగజ్యోతి, సభ్యులు శ్రీమతి రజనీ రెడ్డి, శ్రీమతి వనజ 300 మంది సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.